4 దశాబ్దాల గురువులకు సన్మానం

– వల్లెంకుంట లో పూర్వ ఉపాద్యాయుల గురుపూజోస్సవ వేడుక….
నవతెలంగాణ : మలహార్ రావు
భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం వల్లెంకుంట గ్రామం  సెప్టెంబర్ 5 వ తేదీ టీచర్స్ డే సందర్భంగా వల్లెంకుంట గ్రామ హై స్కూల్ లో 1980 – 1995 లో మొదటగా గురు విద్యలు అందించిన పూర్వ ఉపాధ్యాయులను వల్లెంకుంట గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది…..4 దశాబ్దాల గురువులకు అప్పటి పూర్వ విద్యార్థులు ఆనందంగా స్వాగతం తెలిపి వారు చేసిన సేవలను మరియు వారితో పంచుకున్న తీపి జ్ఞాపకాలను తెలియజేసుకుంటు ఆ గురువులకు పాదాభివందనాలు తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ ఐత కోమల రాజిరెడ్డి గారు సర్పంచ్ శనిగరం రమేష్ గారితో పాటు పూర్వ ఉపాధ్యాయ బృందం,పాఠశాల ఉపాధ్యాయ బృందం,పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు,యువకులతో పాటు విద్యార్థి విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు….