నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా గ్రామస్తులు పెద్ద బండరాయిని ఎవరైతే పైకి ఎత్తుకుంటారు వారికి సన్మానం జరపడం ఆనవాయితీగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ రాయిని లేపడానికి పలువురు యువకులు పాల్గొన్నారు. చివరికి ఓ యువకుడు ఆ బండ రాయిని లేపడంతో అతనిని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాశం సాయిలు కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.