ఆగ్రో చైర్మన్ కాసులను సత్కరించిన మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఘనంగా సన్మానించారు. సోమవారం బీర్కూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో బరంగెడ్గి గ్రామానికే చెందిన సీనియర్ నాయకులు మరియు మైలారం సొసైటీ మాజీ చైర్మన్ అప్పారావు, సీనియర్ నేత నర్సరాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.