నవతెలంగాణ – కామారెడ్డి
కుల, మత ప్రాంతీయ తత్వాలతో ప్రజాలను మభ్య పెడుతున్న ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేయడమే కామ్రేడ్ ఓంకార్ కు నిజమైన నివాళి అని ఎంసీపీఐయు కేంద్ర కమిటీ సభ్యులు వనం సుధాకర్ అన్నరు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజీరై మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులు, అమరజీవి కామ్రేడ్ మద్ధికాయల ఓంకార్ 16 వర్ధంతి సందర్భంగా “ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై అక్టోబర్ 17 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం యంసీపీఐ(యు) కామారెడ్డి జిల్లా కమిటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య హాజరయ్యారు. దీర్ఘకాలం దేశాన్ని పాలించిన దోపిడి వర్గ,మతోన్మాద,అవినీతి ఆకాశవాద పార్టీలు రాజకీయాలను దిగజార్చినాయి అని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచి చట్ట సభలను శాసించిన పార్టీలు ప్రజలకు అనుకూలమైన పాలన పాలన చేయకుండా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకుండా రాజకీయాలను కలుషితం చేస్తూ రాజకీయాలు అంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితికి దిగజార్చారని తెలియజేశారు. ఇన్ని సంవత్సరాలలో ఇంకా కుల మత ప్రాంతీయ తత్వాలు బలపడే విధంగా రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ ఓంకార్ ని గుర్తు చేశారు. వర్గ నిర్మూలన కోసం కమ్యూనిస్టు లేకం కావాలని బహుజనులకు రాజ్యాధికారం కోసం సామాజిక శక్తులు ఏకం కావాలని ఆశించిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ ఓంకార్ ని తెలిపారు. కలుషితమైన ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన ఏసి వర్గ కుల తత్వాలను నిర్మూలించడం తక్షణ రాజకీయ కర్తవ్యంగా భావించడమే ఓంకార్ కి నిజమైన నివాళి అని ముగించారు. ఈ కార్యక్రమం లొ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు మైపాల్, సదానందం, రమేష్, రాజు, నరెష్, రాజమణి, సరుపతొ పాటు తదితరులు పాల్గొన్నారు.