ఈనెల 29న మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కు దళిత కళ్యాణ్ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ను సన్మానించిన వారిలో దళిత కళ్యాణ్ సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దౌలత్ చక్రి, రామచంద్ర గైక్వాడ్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అజయ్, నగర అధ్యక్షులు విజయ్ సాలంకి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దత్తాత్రి, దళిత కళ్యాణ్ సమితి పట్టణ అధ్యక్షులు నవీన్, రామారావు, దేవరావు, శంకర్, విశాల్, భూషణ్, దయానంద్, సన్మానించిన వారిలో ఉన్నారు.