హైదరాబాద్ లో సచివాలయంలో నూతనంగా రోడ్డు భవనాలు అండ్ సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు ఇక తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ,భవనాలు తెలంగాణ రాష్ట్రంలో మెరుగుపరిచి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తామని అన్నారు.