న్యాయవాదులకు సన్మానం

నవతెలంగాణ – ఆర్మూర్  
నిజామాబాద్, పట్టణ భార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన  శ్రీ జగన్మోహన్ గౌడ్  శ్రీ తేడ్డు నర్సయ్య  ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. భార్ అసోసియేషన్ల అభివృద్ధికి పాటుపడాలని, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని  న్యాయ వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచాలని  కేసులను త్వర త్వరగా పూర్తి చేయుటకు న్యాయమూర్తుల సహాయాన్ని అర్జించి  న్యాయవాదులకు పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా  కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజకుమార్ సుబేదార్ , సీనియర్ న్యాయవాది మామిడి విక్రం రెడ్డి, బార్ అసోసియేషన్ కోశాధికారి దిలీప్, బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రెటరీ పిల్లి శ్రీకాంత్  పాల్గొన్నారు.