న్యాయవాదులకు సన్మానం..

Honor to lawyers..నవతెలంగాణ –  ఆర్మూర్ 
అంతర్జాతీయ న్యాయ దినత్సవం సందర్భంగా  పద్మశాలి సంక్షేమ సేవ సమితి ఆధ్వర్యములో  కోర్టులో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు న్యాయ పరంగా  సేవలందిస్తున్న పద్మశాలి ముద్దు బిడ్డలు అడ్వకేట్ సిలివేరి శ్రీధర్,బోట్ల జీవన్, జక్కుల శ్రీధర్, చిలుక కిష్టయ్య, బేతు జగదీష్, ద్యావర శెట్టి అరుణ్ లకు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సమానత్వం, సమ న్యాయం ఉండాలని, న్యాయాన్ని కాపాడితేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింస మార్గములో నడుస్తుంది అని అడ్వకేట్లు న్యాయంగా వ్యవహరించాలి అని  అన్నారు. ఈ కార్యక్రమంలో సేవ సమితి ప్రధాన కార్యదర్శి కొక్కులా రామ కాంత్,మోర్తాడ్ మండల పద్మశాలి అధ్యక్షులు చిలివరి రవి కాకా, ఆర్మూర్ పద్మశాలి సంఘాల తర్పాల అధ్యక్షులు నూకల నారాయణ,బండి అనంత రావు,రుద్ర రాజేశ్వర్,సైబ సుధాకర్,వేముల ప్రకాశ్,సడమస్తుల గణపతి,సభ్యులు ఏడేళ్ళి శ్రీనివాస్,సురుకుంట్ల బూమేశ్వర్,అంబల్ల శ్యాం రావు, తదితరులు పాల్గొన్నారు.