
– కార్యాలయ స్వీపరు కుమారి పాద పూజ తో సన్మానించిన అద్యక్షులు శ్రీరామ మూర్తి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిషత్ ఆద్వర్యంలో,అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి అద్యక్షతన రెండో పాలక వర్గం సభ్యులను గురువారం ఘణంగా సన్మానించారు. ఆగస్ట్ 5 నుండి ఈ పాలక వర్గం పదవీకాలం గడువు ముగియడంతో ఈ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీపీ గా పదవి బాధ్యతలు ఆగస్టు 6 2019 న ప్రమాణస్వీకారం చేసి వచ్చే నెల 5 వ తారీకు కి ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగిందని.దానిలో భాగంగానే ఈ రోజు పాలక వర్గం సభ్యులను కలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.ఇలా మిమ్మలని అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉందనీ,నా తోటి ఎంపిటిసి లు అందరం ఐదు సంవత్సరాలు అన్నా దమ్ములు గా అక్క తమ్ముడు లాగా ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ప్రజలకు సేవ చేశామని,దానికి ఎంపీటీసి లు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసారు.నేను ఎప్పుడైనా మీ ఎవరి పట్ల అయినా పరుసపదజాలం వాడి ఉండే నాకు తెలుసి గాని తెలియగానే మిమ్మల్ని ఎప్పుడైనా అవమానపరిచి ఉంటే, మీ మనసుకు బాధ కలిగే విధంగా నేను ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించగలరని సభ వేదిక ముందు అందరినీ ప్రార్థించారు.అలాగే నేను రాజకీయం లోకి వస్తాను అనుకోలేదు కానీ కొన్ని అనుకోని సంఘటన వల్ల నేను రాజకీయాలు రావడం జరిగిందనీ,ఈ ఐదు సంవత్సరాలు ఎంపీపీ గా నేను ఉండటానికి ప్రధానమైన కారణం నా సోదర సమానులు,నేటి కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ అని గుర్తు చేసుకున్నారు. ఆ రోజున నన్ను ఎంతో నమ్మకంతో ఎంపీటీసీ గా గెలిపించడం జరిగింది.
కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆయన పట్టుబట్టి నన్ను ఎంపీపీ గా చేయడం కూడా జరిగిందని సభా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నారు.అలాగే ఆయనకి ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటాననీ అన్నారు.ఎందుకంటే మరి నాకు ఎంపీపీ పదవి బిక్ష పెట్టింది ఆయనే.అయినా సరే కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉంటున్నాము అని ఆవేదన వ్యక్తం చేసారు.నేను రమేష్ కూడా బాల్య స్నేహితులు మే కానీ ఈ రాజకీయ వచ్చి ఆ స్నేహాన్ని దూరం చేసుకున్నాము అని విచారం ప్రకటించారు.విధి మమ్మల్ని విడదీసింది.అలాగే నేను ఎంపీపీ అవ్వడానికి నన్ను నమ్మి ఆ రోజు అశ్వారావుపేట పట్టణంలో ఉన్న నా తోటి వ్యాపార మిత్రులు,మరియు మా ఆర్యవైశ్య పెద్దలందరూ నన్ను గెలిపించడానికి మండల నాయకులతో మాట్లాడి నా గెలుపు కి కారకులైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.ఆ రోజున పెద్దలందరూ కలిసి అలాగే నాతోటి ఎంపిటిసి లు మీరు అందరూ కలసి నా పై నమ్మకంతో పదవి నాకు ఇప్పించారు. మీ యొక్క నమ్మకాన్ని అలానే సోదర సమానులైన రమేష్ నమ్మకాన్ని, మా పార్టీ యొక్క పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయలేదని నేను భావిస్తున్నాననీ అన్నారు.నేను గడిచిన ఈ ఐదు సంవత్సరాల కూడా రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలను అన్ని వర్గాలను కలుపుకునే వెళ్లానాని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా కష్ట పెట్టి ఉండలేదు మీ అందరూ సహాయ సహకారంతో మన అశ్వారావుపేట మండలానికి సుమారుగా రూ.400 కోట్లు వ్యయం తో అభివృద్ధి పనులు చేసామని అన్నారు.గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ద్వారా ఈ మండలం అభివృద్ధికి సుమారు మరో రూ 400 కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు.
సి సి రోడ్లు కానీ బీటీ రోడ్లు గాని రైతు వేడుకలు గాని వంద పడకల హాస్పిటల్ గాని ఆర్టీఓ ఆఫీస్ కానీ డిగ్రీ కళాశాల గాని అలాగే సెంటర్ లైటింగ్ గాని గుమ్మడి వల్లి లో ఉన్న మహిళా డిగ్రీ కళాశాల, అలాగే గుమ్మడవల్లి – రంగా పురం మధ్యలో బ్రిడ్జి, హాస్పిటల్స్ లో కమిటీ హాల్స్ , డయాలసిస్ సెంటర్, ఇంకా చాలా పనులు మీ అందరి సహకారంతో నేను చేయటం జరిగింది.అలాగే మన అశ్వారావుపేట మండలంలో పలాన సమస్య ఉందని తెలియ చేయగానే తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఈ సభా వేదిక ముందు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.అశ్వారావుపేట మండలంలో నా దగ్గరికి వచ్చిన వారికి అలాగే గౌరవ సభ్యులు వారి యొక్క పరిధిలోని సమస్యలను నా దగ్గర ప్రస్తావించినప్పుడు నా పరిధిలో ఉన్న సమస్యని వెంటనే నేను స్పందించి పరిష్కరించడం జరిగిందని అనుకుంటున్నాను.
అలాగే ప్రపంచ దేశాలను గడగడ లాలిండించిన కరోనా అనే మహమ్మారి మన మండలాన్ని కూడా విచ్చన్యం చేసింది.అటువంటి సందర్భంలో కూడా మనందరం ప్రజలతో మమేకమై స్థానిక సెక్రటరీ అలాగే సర్పంచులను అధికారులు తో కలిసి ప్రజలకి మనోధర్యం కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఈ కరోనా సమయంలో పగలు రాత్రి అని తేడా లేకుండా ఎమ్మార్వో గారు ఎంపీడీవో గారు పోలీస్ సిఐ గారు తో పాటు నేను కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క గ్రామపంచాయతీ కి వెళ్లడం జరిగింది. అర్ధరాత్రి సరిహద్దు గ్రామాల్లో ఉన్న చెక్ పోస్ట్లు కూడా తనిఖీ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.అలాగే ఒక సమస్యపై వేదాంత పురం సర్పంచ్ గారు మరియు అక్కడ ప్రజలు తిమ్మాపురం అనే గ్రామంలో తాగడానికి నీళ్లు కరెంటు లేదని నిరాహార దీక్ష చేస్తే అర్ధరాత్రి 11 గంటలకి వర్షంలో నేను వెళ్లి వాళ్లతో మాట్లాడి పి ఓ గారితో మాట్లాడి వాళ్లకు మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో కరెంటు మరియు మంచినీటి బోరు ఇప్పించడం జరిగింది. అలాగే కొత్త గంగారం గ్రామంలో కూడా కరెంట్ మీ అందరి సహకారంతో వేయడం జరిగిందని సభా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.అలాగే మొద్దులమడ జీ పీ లో రాళ్లు వాగు ఒక గుంపులు నీళ్లు లేవని పేపర్లో వేయటం జరిగింది. ఆ యొక్క పత్రిక కథనం చదివి వెంటనే నేను సంబంధిత ఎంపీడీవో గారు అలాగే ఫారెస్ట్ రేంజ్ ను పిలిచి మిషన్ భగీరథ ఏఈ,డీ ఈ తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి 24 గంటలు లోపే అక్కడ వాళ్లకి వాటర్ లైన్ వేయించాను అని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో మీ అందరి సహకారంతో ఈ రోజు వరకు అశ్వారావుపేట మండలంలో చేయడం జరిగిందని,నేను తెలియజేస్తున్నాను.అలా మీ అందరి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.అనంతరం తోటి ఎంపీటీసీ లకు జడ్పీటిసి కి,అలాగే మండల పరిషత్ అధికారులకు,గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సన్మానం చేసి జ్ఞాపికలను అందజేసారు.అలాగే ఎంపీపీ శ్రీరామ మూర్తిని పలువురు మండల నాయకులు ఎంపిటిసి లు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
అనంతరం కార్యాలయం స్వీపరు కుమారి పాదపూజ జేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసీ చిన్నంశెట్టి.వరలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,ఎంపిటిసి లు వేముల భారతి,సత్యవరపు తిరుమల,నండ్రు.జయ భారతి వగ్గెల అనసూయ,కాసాని దుర్గ,మారుతి లలిత, కోర్షిక రామకృష్ణ,వల్లెపు తిరుపతి రావు,పండ రాజు,నాగలక్ష్మి, ఎంపీడీవో.శ్రీనివాస రావు, తహసీల్దార్ కృష్ణా ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్,మండల నాయకులు కోటగిరి సీతారామస్వామి,జూపల్లి రమణారావు,సీపీఐ నాయకులు సలీం,బీజేపీ మండల అధ్యక్షుడు బండారి చంద్ర శేఖర్, నార్లపాటీ.రాములు,జల్లిపల్లి దేవరాజు,సీమకూర్తి.వెంకటేశ్వర రావు,భోగవల్లి రాంబాబు,మండల నాయకులు తాడేపల్లి. రవి,మండల కార్యాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.