మత రాజకీయాలను వ్యతిరేకించడమే సుందరయ్యకు నివాళి

నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
మత రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారానే సుందరయ్య కు నిజమైన నివాళి అర్పించినట్టని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు నెరవేర్చేందుకు యువత వామపక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలన్నారు. సుందరయ్య ఆదర్శ కమ్యూనిస్టు అన్నారు. ఆయన ఆశయ సాధనకు కార్యకర్తలు పునర్‌ అంకితం అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు గుంటూరు శ్రీనివాస చారి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, మండల కమిటీ సభ్యులు చింతకాయల నరసింహ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిట్ట రాములు, సిఐటియు నాయకులు రాచకొండ కృష్ణ, కడ్తాల బిక్షమయ్య,బొడ్డుపల్లి లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ ఎం : భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) వ్యవస్థాపక సభ్యులు, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ శాసనసభ మాజీ సభ్యులు, రైతాంగ పోరాట వీరుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంతో పాటు పల్లెర్ల, కూరెళ్ళ గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి సుందరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన గొప్ప వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కార్యదర్శి వేములబిక్షం పార్టీ డివిజన్నాయకులురచ్చ గోవర్ధన్‌, వి. గోపాల్‌ రెడ్డి పల్లెర్ల, కూరెళ్ళ పార్టీ గ్రామశాఖకార్యదర్శిలు గుణబోయిన స్వామి, తుమ్మలగూడెం యాదయ్య, మండల నాయకులు భాషబోయిన రాములు, బండ బీరయ్య, భాషబోయినబుగ్గయ్య, రామ్‌ రెడ్డి స్వామి, యాదిరెడ్డి, నాగయ్య, రమేష్‌, అంజయ్య, నర్సింహా, ఆగయ్య, లక్ష్మమ్మ, అంజమ్మ గోపాల్‌,స్వామి, సత్తయ్య, బిక్షం, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : భూస్వాముల వ్యవస్థ పోయి కష్టజీవుల రాజ్యం రావాలని నిరంతరం పోరాడిన ఉద్యమ నేత అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. మండల కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, నాయకులు లక్ష్మయ్య, యాదగిరిి, పున్నమ్మ ,నాగరాజు, మల్లేష్‌ ,బాల నరసింహ, బిక్షపతి ,మహేష్‌ ,ఉప్పలయ్య ,తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్‌:తెలంగాణ ఆయుధ పోరాట యోధుడు, ప్రజల మనిషి పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో మోత్కూరు మున్సిపల్‌ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో, మండలంలోని పాలడుగు గ్రామంలో వేర్వేరుగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు సుందర రామిరెడ్డి గా ఉన్న తన పేరును సుందరయ్యగా మార్చుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, లక్ష్మి, మెతుకు అంజయ్య, కందుకూరి నర్సింహ, అలివేలు, పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, సహాయ కార్యదర్శి చింతకింది సోమరాజు, లక్ష్మి, వడ్డేపల్లి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్‌ : పట్టణ కేంద్రంలో బ్రాహ్మణపల్లి కూడలి వద్ద సుందరయ్య చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్‌, మండల కార్యదర్శి బండారు శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం ఉన్నత వర్గంలో పుట్టిన పేద ప్రజల బతుకులు బాగుకోసం, భూమి కోసం, భూమి విముక్తి కోసం పోరాటం చేసిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు గాడి శ్రీనివాస్‌, పట్టణ కార్యదర్శి టంటం వెంకటేష్‌, నాయకులు పాశం బాలయ్య, వాడపల్లి జంగయ్య, ఆకారం నాగరాజు, ఆంజనేయులు, సుంకరి మహేష్‌, తూర్పాటి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ : దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా తెలిపారు. శుక్రవారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండల, మున్సిపల్‌ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మున్సిపల్‌, మండల కార్యదర్శులు బండారు నర్సింహ, గంగదేవి సైదులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆకుల ధర్మయ్య, తడక మోహన్‌, బొజ్జ బాలయ్య, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల దాసు, ఆర్‌.శ్రీకాంత్‌, శంకర్‌రెడ్డి, రాజు, యాదయ్య పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సుందరయ్య వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కొక్కొండ లింగయ్య,మండల కమిటీ సభ్యులు తలారి మాతయ్య ,ఆవుల కలమ్మ, గడ్డమీది నరసింహ, తూటి వెంకటేశం , నాయకులు కోట నాగరాజు ,కోట నరేష్‌ ,పోతరాజు భరత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్‌ :మండలంలోని కంది గడ్డ తండాలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేతావత్‌ లక్ష్మి, సుగుణమ్మ ,మాలోతు మధు, సురేష్‌ ,రమేష్‌, కమలమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ,ప్రజా పోరాటాలు చేయడం ద్వారానే సుందరయ్యకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్‌ అన్నారు .శుక్రవారం పట్టణకేంద్రంలోని ఏసీరెడ్డి భవనం ఆవరణలో సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి ఆయన ఆ పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్‌తోకలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మెన్‌ మోరిగాడి చంద్రశేఖర్‌ , సీఐటీయూ మండల కన్వీనర్‌ మోడీ గారి రమేష్‌ ,తాళ్లపల్లి గణేష్‌ , వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు , నల్ల మాస తులసయ్య ,మోరిగాడి మహేష్‌, మోరిగాడి అజరు, ఎలుగల శివ, పిక్క గణేష్‌, వడ్డేమాన్‌ బాలరాజు, వడ్డెమాను విప్లవ్‌, అశోక్‌, అంజయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు బుగ్గ నవీన్‌, ఎండి అమీర్‌, బండ శ్రీను ,రాములు తదితరులు పాల్గొన్నారు.
వలిగొండరూరల్‌ : మండల పరిధిలోని తుర్కపల్లి, సంగెం,వర్కట్‌ పల్లి గ్రామాల్లో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయనచిత్రపటానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య, తుర్కపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ వెలమకన్నే బాలరాజు, వర్కట్‌ పల్లి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్‌ రెడ్డి, నాయకులు పల్సం స్వామి,సల్ల ఐలయ్య, రాధారపు మల్లేశం, కీసరి దామోదర్‌ రెడ్డి,పబ్బతి మల్లేశం,గోగు కిష్టయ్య, తుమ్మల సంజీవరెడ్డి, నర్సిరెడ్డి,వనం మురళి, కేసాని మల్లేశం,బండిగారి రాములు, బండిగారి శంకరయ్య,చేగురి రాములు,బొక్క వెంకట్‌ రెడ్డి, బద్దం మల్లారెడ్డి,సల్లా రాజయ్య,వట్టిపల్లి రాజు,తుమ్మల మల్లారెడ్డి,మాసంపల్లి యాదయ్య,కొలగాని మత్స్యగిరి,వెల్మకన్నే ఉదరు,పలుసం మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : నేటి రాజకీయ నాయకులందరికీ కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమని సీఐటీయూ జిల్లా నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు,సీపీఐ(ఎం)పార్టీ పట్టణ కార్యదర్శి గాదె నరేందర్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పద్మశాలి కాలనీలో ఆ పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని పురస్కరించుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు బావండ్ల పల్లి బాలరాజు, పల్లె సత్యం, బావండ్ల పల్లి సత్యనారాయణ, కుందూరు వెంకటేశ్వర్లు, సిఐటియు పట్టణ అధ్యక్షుడు రాసాల రమేష్‌, తరిగోపుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : పట్టణంలో పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద శుక్రవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఆ పార్టీ మండల పట్టణ కార్యదర్శులు సిర్పంగి స్వామి,గర్దాసు నరసింహ సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి పట్టణ నాయకులు వేముల లక్ష్మయ్య ఆలకుంట్ల నరసింహ, కవిడే కృష్ణ,కర్నాటి వెంకటేశం,ఉపేందర్‌, సోమయ్య,నరేష్‌, తదితరులు పాల్గొన్నారు .
రాజాపేట:పేదల పెన్నిధి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కార్మిక నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శనీయుడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మంగ నర్సింహులు అన్నారు.శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్‌ గా సాధారణ జీవితం గడిపిన మహౌన్నత నేత సుందరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోశెట్టి, మండల కార్యదర్శి బబ్బురి శ్రీనివాస, కటికల రామచంద్రం, పబ్బోజు రాధమ్మ, తదితరులు పాల్గొన్నారు.