మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారంనాడుబదలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయురాలు కమల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శాలువా పుష్ప గుచ్ఛంతోఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బదలీ పై వెళ్లిన ఉపాధ్యాయులు గంగా కిషన్,శశికాంత్, చంద్రకాంత్,రాకేష్,ఫయాజ్,రాజేందర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో విధులు నిర్వహించి మిమ్మలిని వదలిఇతర పాఠశాలకు వెళ్లినందుకు కొంత బాధ కలిగినబదిలీల్లో బాగంగా తప్పక వెళ్లడం జరిగిందని విద్యార్థులకు చెప్పడం జరిగింది వచ్చిన ఉపాధ్యాయుల సలహాలు సూచనలు పాటించి చదువు పై శ్రద్ధ వహించి మంచి మార్కులతో పాసై తల్లిదండ్రులకు మరియు పాఠశాలకుపేరు తీసుకొనిరావలని సూచించారు.
మాజీ ఎంఎంపి సేవలు మరవాలేనివి
మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల నుతన బిల్డింగ్ కొరకు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేసిన కృషి వల్లనే నూతన బిల్డింగ్ ఏర్పాటు అయిందని విద్యార్థుల కోసం ఏది అడిగిన కాదనకుండా ఆయన వంతుగా కృషి చేశారని వారు కొనియాడారుఇంత పెద్ద మొత్తంలో పాఠశాల నూతన బిల్డింగ్ నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందని సంతోష వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.