ఉత్తమ గురువులకు సన్మానం

నవతెలంగాణ- తాడ్వాయి
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఐటిడిఏ ఏటూర్ నాగారం లో గురువులకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఏటూర్ నాగారం ఐటిడిఏ పిఓ అంకిత్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లకావత్ పద్మ,  డ్రాయింగ్ టీచర్ కొత్త రవీందర్, కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ సిహెచ్ జ్యోతి లకు శాల్వాలు కప్పి పూలమ్మలలతో అవార్డులు అందజేసి, వారి సేవలను కొనియాడారు. గురుపూజ సందర్భంగా సన్మానం పొందిన ప్రధానోపాధ్యాయులు లకావత్ పద్మ, డ్రాయింగ్ టీచర్ రవి, ఇంగ్లీష్ లెక్చరర్ జ్యోతి లకు వివిధ ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రశంసించారు. వారి సేవలు ఏజెన్సీలు ఇంకా ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిడి పోచం, జిసిడిఓ సుగుణ, డిప్యూటీడీవో సారయ్య తదితరులు పాల్గొన్నారు.