క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ కు సన్మానం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్రావును బుధవారం డిచ్ పల్లి మండల  కేంద్రంలో రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గడ్డం ఆమోస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద  క్రైస్తవుల ప్రత్యేక పైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా డి.రాజేశ్వర్రావును నియమించి నందుకు సిఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సన్మానించిన వారిలో అధ్యక్షులు గడ్డం ఆమోస్,సెక్రటరీ వాసా రాబర్ట్, సలహాదారులు ఎన్.మోహన్, ఎం. బాలస్వామి, జిల్లా క్రైస్తవ మత పెద్దలు తదితరులు ఉన్నారు.