బదిలీపై వెళ్తున్న జీఎంకు సన్మానం

బదిలీపై వెళ్తున్న జీఎంకు సన్మానంనవతెలంగాణ-రెబ్బెన
బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌గా పని చేసి జీఎం(మార్కెటింగ్‌) కార్పోరేట్‌కు బదిలీపై వెళ్తున్న జనరల్‌ మేనేజర్‌ డి.రవిప్రసాద్‌ బెల్లంపల్లి ఏరియా అధికారులు సన్మానించారు. జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఏరియాలోని ఆయా విభాగాల అధికారులు ఒక్కోకరిగా అభిప్రాయాలను తెలిపారు. జీఎం సేవలను కొనియాడారు. అనంతరం జీఎం రవి ప్రసాద్‌ని శాలువాతో సన్మానించి పూల మొక్కను అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జీఎం మచ్చగిరి నరేందర్‌, ఖైరిగూడ పీఓలు ఎన్‌ సత్యనారాయణ, ఎన్‌ ఉమాకాంత్‌, సీఎంఓఏఐ అధ్యక్షుడు టి.మధుసూదన్‌, పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు.
జీఎం ను సన్మానించిన బీజేపీ నాయకులు
గోలేటి సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న డి.రవి ప్రసాద్‌ను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యలమంచి సునీల్‌ చౌదరి ఉన్నారు.
బదిలీ పీఓకు సన్మానం
ఖైర్‌గూడ ఓసీలో బదిలీ పై వెళ్తున్న పీఓ ఎన్‌.సత్యనారాయణను అదికారులు, సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. 15 నెలల పాటు ఖైర్‌గూడ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పని చేసిన ఆయన సేవలను వక్తలు కొనియాడారు. శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఓటూ జీఎంగా బదిలీపై వెళ్తున్నందున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్‌ ప్రవీణ్‌ వీ ఫాటింగ్‌, సీఎంఓఏఐ అధ్యక్షుడు మధుసూధన్‌, సంక్షేమ అధికారి వేణు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.