మండలంలోని అమీర్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం తాజా మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులను గ్రామపంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. తాజా మాజీ సర్పంచ్ పెండే ప్రభాకర్, మాజీ ఉపసర్పంచ్ పోతుగంటి స్వామీ, వార్డు సభ్యులను గ్రామపంచాయతీ సిబ్బంది శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పెండే ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సహాయ సహకారాలు మరవలేనిమన్నారు. పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతుగా ఎల్లవేళల కృషి చేశానని, ఇందుకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జులేఖ, చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.