నవతెలంగాణ-ఆర్మూర్ : జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన డీఈవో అశోక్ ను శుక్రవారం 1987-88 బ్యాచ్ పూర్వ చాత్రోపాధ్యాయులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. 36 సంవత్సరాల క్రితం తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం లో ని మిర్దాపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, పీఆర్టియు జిల్లా మహిళా కార్యదర్శి సుజాత, లింబాద్రి, ఎస్ సుజాత, సుమ, లీలా, తదితరులు పాల్గొన్నారు.