నవతెలంగాణ-మద్దూరు
సిద్దిపేట జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులను మద్దూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మద్దూరు మండల అధ్యక్షులు దొంతుల శ్రీకాంత్ ఎన్నికయ్యారు నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మద్దూరు మండలానికి రావడంతో జిల్లా అధ్యక్షుడు దొంతుల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి,కోశాధికారి భాస్కర్ లను మద్దూరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మాజీ అధ్యక్షుడు కొరిగింజ బాలేష్,గొట్టే పరమేష,శంకర్, శేఖర్,దయాకర్, పర్శరాములు, శ్రీకాంత్, శ్రీధర్, బాబు తదితరులు పాల్గొన్నారు.