కవి ఘనపురం కు సన్మానం

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మార్చి 21 గురువారం రాత్రి ‌హైదరాబాద్ కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్లో  భారత సాహిత్య అనువాద పరిషత్, విమల సాహిత్య సమితి సంయుక్త నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనం హృద్యంగా సాగింది. నిజామాబాద్ కు చెందిన ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ ఈ కవి సమ్మేళనంలో “అస్తిత్వం” అనే కవితను చదివి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనపురం దేవేందర్ ను ఘనంగా సన్మానించారు. డాక్టర్ బిక్కీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, డాక్టర్ జల్ది విద్యాధరరావు , డాక్టర్ వి డి రాజగోపాల్ , డాక్టర్ దామోదరాచారి, పద్మ, రమాదేవి కులకర్ణి, సుతారపు వెంకట్ నారాయణ , నివాస్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.