గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానం

నవతెలంగాణ – తొగుట
గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానించమని పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు అన్నారు. బుధవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామ పంచాయతీ పాల్గవర్గం ఐదు సంవత్సరాలు పూర్త యిన సందర్భంగా సర్పంచ్ చిక్కుడు చంద్రం, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. 5 సంవత్సరాలు గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేసి, ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిక్కుడు చంద్రం, ఉప సర్పంచ్, లింగాల లలిత స్వామి, వార్డు సభ్యులు బోయిని మురళి, చెరుకు రేణుక లక్ష్మారెడ్డి, బోయిని బాలరాజు, మంతూర్ లక్ష్మి, సయ్యద్ జలీల్, కారోబార్ యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ దూలం యాదగిరి గౌడ్, మాస్టీ యాదగిరి పాలకవర్గ సిబ్బం ది లింగాల సాయిలు, లింగాల స్వామి, లింగాల కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.