
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శనిగరం రాజబాపు, ఉపాధ్యక్షుడు మంథని రమేష్, ప్రధాన కార్యదర్శి శనిగరం సురేష్, కోశాధికారి మారేపాక సంజీవ్ ల ఆధ్వర్యంలో మండలంలోని వళ్లెంకుంట గ్రామ సర్పంచ్ శనిగరం రమేష్, కార్యదర్శి నరేశ్ తో పాటు పంచాయతీ పాలకవర్గానికి గురువారం ఘనంగా పూలమాల, శాలువాలతో సన్మానించారు.గత ఐదేళ్లుగా పాలకవర్గం గ్రామాభివృద్ధికి కృషి చేసిన సందర్భంగా అభినందించి సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కన్నూరి సారయ్య,శనిగరం లచ్చయ్య, మహేష్, రాజేందర్, సారయ్య, నగేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.