పారిశుద్ధ కార్మికురాలికి సన్మానం..

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికురాలు శ్రీమతి జంబి సాయమ్మ పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చైర్పర్సన్ ,కమిషనర్ ఆమెను ఘనంగా సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల యొక్క కృషి వారి యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ శేఖర్ సీనియర్ అకౌంటెంట్ రాందాస్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..