జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్-అనిత దంపతుల కుమారుడు ఆవుల నిఖిల్ వరసగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న అభినందనలు తెలియజేశారు. 2022లో రైల్వే గ్రూప్-డి ఉద్యోగంతో పాటు.. గ్రూప్-4లో గ్రంథాలయ శాఖలో జూనియర్అసిస్టెంట్ గా కొలువు సాధించారు. ఆదివారం జోగురామన్న నివాసంలో ఆయనను శాలువలతో సత్కరించారు. యువత నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కష్టపడితే సరైన ఫలితం దక్కుతుందని తెలిపారు. తన స్వగ్రామం నుండి వచ్చిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.