అక్కినేని కుటుంబ వారసుడిగా నాగ చైతన్య 2009లో ‘జోష్’తో సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అక్కడ్నుంచి నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపిస్తూ అందర్నీ అలరిస్తున్నారు. 100% లవ్, ఏ మాయ చేశావే, వెంకీ మామ, మజిలి, లవ్‌స్టోరీ వంటి తదితర చిత్రాలతో అటు ప్రేక్షకులను, ఇటు ఆయన అభిమానులను మెస్మరైజ్ చేశారు. అంతేకాదు అక్కినేని నట వారసత్వాన్ని నిలబెట్టారు. ‘ధూత’ వంటి వెబ్ సిరీస్‌తో ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సినిమాలతో పాటు బ్లాక్ బర్డ్స్ రేసింగ్ ఫ్రాంచైస్ తీసుకుని తన క్రీడాభిమానాన్ని చాటుకుంటున్నారు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించిన ాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండిస్టీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: షామ్‌దత్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.