యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

విక్రాంత్‌, మెహరీన్‌ పిర్జాదా, రుక్సర్‌ థిల్లాన్‌ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 2న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. సోమవారం రోజు టీజర్‌కు రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే విక్రాంత్‌ ఇన్‌టెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. తన చేతిలో మాస్క్‌ ఉంది. డార్క్‌ టోన్‌తో ఉన్న ఈ పోస్టర్‌ ప్రతీ ఒక్కరి దష్టిని ఆకర్షిస్తోంది.
‘స్పార్క్‌’ మూవీ చిత్రీరణ అంతా పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు టీజర్‌ ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ క్రియేట్‌ అయ్యింది. ‘ఎఫ్‌3’లో మెప్పించిన బ్యూటీఫుల్‌ మెహరీన్‌ ఫిర్జాదా ఇందులో కథానాయిక. అలాగే రుక్సర్‌ థిల్లాన్‌ కూడా హీరోయిన్‌గా మెప్పించనుంది. విక్రాంత్‌ ఈ సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయం అవుతున్నారు.
డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ దర్శక నిర్మాణంలో అన్‌ కాంప్రమైజ్డ్‌గా రూపొందుతున్న ఈ యూనిక్‌ సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు ‘హదయం’ ఫేమ్‌ హేషం అబ్దుల్‌ వహాబ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్షణ నటుడు గురు సోమసుందరం కీలక పాత్రలో అలరించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాజర్‌, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్‌, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.