మెప్పించే యూనిక్‌ కాన్సెప్ట్‌

మెప్పించే యూనిక్‌ కాన్సెప్ట్‌శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈనేపథ్యంలో శనివారం హీరో విశ్వక్‌ సేన్‌ ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’రాజ్‌ కందుకూరి నా కెరీర్‌ బిగినింగ్‌లో ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇది నా సినిమా వేడుకలానే అనిపిస్తుంది. ట్రైలర్‌లో శివ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు. ట్రైలర్‌ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీ చరణ్‌ నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. దర్శకుడు పురుషోత్తం రాజ్‌ సినిమాని చాలా గ్రిప్పింగ్‌ గా తీశారని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్‌లో చూడాలి’ అని అన్నారు.
‘ఈ సినిమా కంటెంట్‌ పై చాలా నమ్మకంగా ఉన్నాం. ఇంత మంచి కంటెంట్‌ సినిమా చేసినందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ సినిమాతో కొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తామనే నమ్మకం ఉంది. చాలా యూనిక్‌ ఎలిమెంట్స్‌తో తీసిన చిత్రమిది. పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్‌ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా, నేను పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి’ అని హీరో శివ కందుకూరి చెప్పారు.
దర్శకుడు పురుషోత్తం రాజ్‌ మాట్లాడుతూ, ‘ఇది అందరూ ఎంజారు చేసే చిత్రం. అందరి ఇంటిముందు ఒక దిష్టి బొమ్మ ఉంటుంది. ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ. అదేంటి అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ట్రైలర్‌లో రివీల్‌ చేయని ట్విస్ట్‌లు సినిమాలో చాలా ఉన్నాయి. అది అందర్నీ బాగా థ్రిల్‌ చేస్తాయి’ అని తెలిపారు. ‘చాలా డిఫరెంట్‌ మూవీ ఇది. ఇందులో ఉండే కంటెంట్‌ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ శక్తివంతమైన పాత్రను పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని హీరోయిన్‌ రాశి సింగ్‌ అన్నారు.
నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ, ‘చాలా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధించి, శివకి మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ‘అవుట్‌ఫుట్‌ అద్భుతంగా వచ్చింది. మార్చి 1న సినిమా వస్తోంది. మంచి థ్రిల్లర్‌ ఇది. కచ్చితంగా ఆడియెన్స్‌ చాలా బాగా ఎంజారు చేస్తారు’ అని నిర్మాతలు శశిధర్‌, స్నేహల్‌ అన్నారు.