యూనిక్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాత్రికేయు లతో ఈ చిత్ర టికెట్‌ బుకింగ్స్‌ అనౌన్స్‌మెంట్‌ చేయించారు. ఈ సందర్భంగా హీరో నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ను ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకున్న తీరు చూస్తుంటే మాకు కాన్ఫిడెన్స్‌ పెరిగింది. మేము సినిమాలో చెప్ప బోతున్న పాయింట్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని అనిపించింది. కష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్‌ అవుతుంది, కష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’ అని అన్నారు. ‘రీసెంట్‌గా వేసిన కొన్ని షోస్‌కు రెస్పాన్స్‌ చాలా బాగుంది. మా ట్రైలర్‌లో చూసింది 30% అనుకుంటే సినిమాలో 70 % ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్‌ జర్నీలా అనిపిస్తుంది’ అని దర్శకుడు తెలిపారు.