సర్‌ప్రైజ్‌ చేసే యూనిక్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ చేసే యూనిక్‌ థ్రిల్లర్‌నవీన్‌ చంద్ర హీరోగా లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘లెవెన్‌’. ఎఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై అజ్మల్‌ ఖాన్‌, రేయా హరి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ, ‘ఈ కథ విన్న వెంటనే చాలా బావుందనిపించింది. స్క్రిప్ట్‌ కోసం ప్యాషన్‌గా పని చేసిన నిర్మాతలని నేను ఇప్పటిదాక చూడలేదు. సినిమాకి కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు. ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు. ఖచ్చితంగా మంచి విజయం అందుకుంటారు. ఈ థ్రిల్లర్‌ ఖచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కథ, స్క్రీన్‌ ప్లే, యాక్షన్‌, యాక్టింగ్‌ అన్నీ అద్భుతంగా ఉంటాయి. నా కెరీర్‌లో బెస్ట్‌ థ్రిల్లర్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘ఇదొక ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. ఇందులో ఒక యూనిక్‌ పాయింట్‌ ఉంది. అది మిమల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. టీజర్‌లో చూసిన ఎగ్జైట్‌మెంట్‌ సినిమాలోనూ ఉంటుంది’ అని డైరెక్టర్‌ లోకేశ్‌ అజ్ల్స్‌ చెప్పారు. నిర్మాత రేయా హరి మాట్లాడుతూ, ‘ఇది తెలుగులో నా మొదటి సినిమా. నవీన్‌ చాలా అద్భుతమైన యాక్టర్‌. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఇది మా మూడో సినిమా. తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు హిట్స్‌ అయ్యాయి. అవుట్‌ అండ్‌ అవుట్‌ యంగేజింగ్‌గా ఉంటూ అందరికీ నచ్చుతుంది’ అని మరో నిర్మాత నిర్మాత అక్బర్‌ అన్నారు.