గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా ఈనెల 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల శనివారం మీడియాతో మాట్లాడుతూ, ‘యాక్షన్‌తోపాటు హిలేరియస్ ఎంటర్‌టైన్ మెంట్ ఉన్న సినిమా ఇది. ఇందులో పాప పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ. అందుకే మార్కెట్ పరంగా ఛాలెంజ్‌గా తీసుకుని దానికి అనుగుణంగా డిజైన్ చేశాను. అందుకు నిర్మాతల సపోర్ట్ బాగుంది. నేను విశ్వంను ఎలా ఊహించుకున్నానో అలా తీయగలిగాను. బర్నింగ్ ఇష్యూని తీసుకుని దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ఎలా చెప్పొచ్చో చేశాను. మేకింగ్ వైజ్‌గా వినూత్నంగా ఉంటుంది. నాకూ, గోపీకి చాలా ఫ్రెష్ సినిమా అవుతుంది. గోపీచంద్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే రెగ్యులర్ ఫైట్స్ కాదు. సహజంగా ఉంటాయి. ప్రతి యాక్షన్ హీరోయిజంలా ఉంటుంది. ‘వెంకీ’ సినిమాలో మాదిరిగా ఇందులోనూ ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం అని పెట్టాను. 30 నిముషాల పాటు వెన్నెల కిశోర్, గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్ వీరందరితో టైన్ జర్నీ చాలా బాగుంటుంది. ‘ఢ’ సీక్వెల్ చేయమని అడుగుతున్నారు. కానీ శ్రీహరిని రీప్లేస్ మెంట్ చేయడం కష్టం’ అని అన్నారు.