
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ PDSU కమిటీ ఆధ్వర్యంలో ఫ్లక్ కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ ను తొలగించి, వేంటనే అయనపై చర్యలు తీసుకోకపోతే బిఅర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా విసృతంగా ప్రచారం చేస్తామని,జిల్లా ,రాష్ట్ర, కేంద్ర ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ మానవ హక్కుల కమిషన్లను ఆధారాలతో సంప్రదిస్తామని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్యూ అధ్యక్షులు సంతోష్ అన్నారు.
అదివారం యూనివర్సిటీ లో పిడిఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో ప్లె కార్డులతో నిరసన తెలిపిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు చేస్తున్న వైస్ ఛాన్సలర్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులుగా బిఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వివరించారు.యూనివర్సిటీ విద్యార్థులు ఫీజుల రూపంలో కట్టిన డబ్బులను పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు నిధులంతా వీసీ దుర్వినియోగం చేశారని,తెలంగాణ యూనివర్సిటీలోనే ఈసి మీటింగ్ పెట్టాలని, యూనివర్సిటీ బడ్జెట్ నుంచి అక్రమంగా ఖర్చు చేసిన డబ్బంత రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.ఈసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోతే ఈసీ సభ్యులంతా వేంటనే రాజీనామా చేయాలన్నారు.
వీసీ రవీందర్ గుప్తా తన అధికార పరిధిని దాటి యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇస్తామని భూములు కోల్పోయిన గిరిజనులకు ,గ్రామీణ ప్రాంతాల దళితులకు ,బీసీలకు, మైనారిటీలకు మాయ మాటలు చెప్పి వాళ్ల దగ్గర నుంచి లక్షల రూపాయలు తిసుకుని తమ జేబులు నింపుకొని, వాళ్లతో పనులు చేయించుకొని జీతాలు ఇవ్వకుండా, ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటామని, మా దగ్గర వారి ఆధారాలు ఉన్నాయని, జిల్లా, రాష్ట్ర ,కేంద్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ మానవ హక్కుల కమిషన్ను సంప్రదిస్తామని, వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.సంప్రదించవలసిన నెంబర్లు 9912252495,9573385794 ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్ ,సాయి తేజ ,రాజ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.