వెంకటేష్ నటించిన తన 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘సైంధవ్ మీ లాండ్ మార్క్ 75వ సినిమా కదా.. ఒత్తిడి ఏమైనా ఉందా అని అందరూ అడుగుతున్నారు. నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్‌లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్‌లా అనుకోవచ్బు. నా వరకూ ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. దర్శకుడు శైలేష్ కొలను కథ చెప్పినపుడు చాలా బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ అనేది నాకు బాగా నచ్చింది. రెగ్యులర్‌గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. యాక్షన్ చాలా నేచురల్‌గా ఉంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. సైంధవ్ వరల్డ్ బిల్డింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సైంధవ్ తర్వాత ఈ తరహాలో ఇంకొన్ని కథలు వచ్చే అవకాశం ఉంది’ అని అన్నారు.