నాకెంతో ప్రత్యేకమైన సినిమా

A very special movie for meఈ సంక్రాంతి సందర్భంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను ఈనెల10న, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్‌ చేస్తున్నాం. ఈ రెండు నాకు కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్స్‌ అవుతాయి’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ‘ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న మూడు సినిమాలకు టికెట్‌ రేట్స్‌ పెంచుకోవటానికి, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చింది. పవన్‌కళ్యాణ్‌ చొరవతోనే ఇది సాధ్యమైంది. ఆయనకు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ‘గేమ్‌ ఛేంజర్‌’ పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైన సినిమా. శంకర్‌, రామ్‌చరణ్‌ కాంబోలో ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే ఆల్‌రెడీ సూపర్‌ హిట్‌ అని అందరూ అంటున్నారు. ఈ బజ్‌ రావటానికి కారణం అనీల్‌ రావిపూడి. తను కథ చెప్పినప్పటి నుంచి అన్నీ తన మీద వేసుకుని సినిమాను ‘ఎఫ్‌2’లాగా సూపర్‌ హిట్‌ కొట్టాలని కష్టపడ్డారు. ఎఫ్‌2ను ఆడియెన్స్‌ ఎలాగైతే హిట్‌ అయ్యిందో, అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బిగ్‌ హిట్‌ కాబోతుంది. అలా రెండు సినిమాలతో ఫుల్‌ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అని తెలిపారు.