ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ పై  విజిలెన్స్ విచారణ జరిపాలి..

– సిఎంకు  విజ్ఞప్తి చేసిన ఓయు జేఎసి అద్యక్షులు సర్ధార్ వినోద్ కుమార్
నవతెలంగాణ-ముధోల : బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీగా వేంకట రమణతనరెండేళ్ల,పదవీకాలంలోచేసినఅవినీతి,అక్రమాలు నకిలీ బిల్లుల చెల్లింపుల మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చెప్పట్టాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డికి  ఉస్మానియా జెఎసి అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో సంప్రదాయ యూనివర్సిటీలకు పర్మనెంట్ వీసీలను నియమిస్తుననట్టే ,బాసర ట్రిపుల్ ఐటీ చట్టాన్ని మార్పులు చేసి ట్రిపుల్ ఐటీకి కూడా పర్మనెంట్ వీసినీ నియమించాలని డిమాండ్ చేశారు.నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన ఇంచార్జి విసి వెంకట రమణ మీద సత్వరమే చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ  విద్యార్థి వ్యతిరేకి కావటంతోట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అoక్షల పేరుతో, మెస్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకమైన భోజనం పెడుతూవిద్యార్థులకు ఇబ్బందులకుగురిచేస్తున్నారని ఆరొపించారు . ఆలాగే ఇంచార్జి వీసీ  బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోవటంమే గాక  విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మీద దుష్ప్రచారం చేస్తూకాలంవెళ్లదీస్తున్నారనిఆయనఅన్నారు రాష్ర్టంలోఉన్నాఏకైకటెక్నాలజీయూనివర్సిటి అయిన బాసర ట్రిపుల్ ఐటీనీ కాపాడుకునే విధంగా,యూనివర్సిటిఅభివృద్ధికొరకు,విద్యార్థులకు మంచి భవిషత్తు కోరకు యూనివర్సిటీలో ఉండి విద్యార్థుల బాగోగులు చూసే సీనియర్ ప్రొఫెసర్లనే వీసీ గా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ ఐటీ బాసర లో విద్యార్ధులు ఆత్మహత్యలకు అయన విధానాలే కారణమని, అయన హయాంలో  విద్యార్థులుఆత్మహత్యలుచేసకున్నారని  వాటి మీద రిటైర్డ్ జడ్జితో కమిటి వేయాలని డిమాండ్ చేశారు.  విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు పర్మనెంట్ టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసీ యునివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం బాటలు వేయాలని కోరారు.