మండల పరిధిలోని రేగులపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ అబ్దుల్ అహమ్మద్ సందర్శించి పరిశీలించారు. కొనుగోళ్లు పూర్తయిన వరిధాన్యాన్ని త్వరగా మిల్లలకు తరలించాలని అదనపు కలేక్టర్ ఇంచార్జీలకు సూచించారు. డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, డీఎస్ఓ తనుజ, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీన్, పంచాయతీ కార్యదర్శి జీవన్ రెడ్డి, సీసీలు హజరయ్యారు.