సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ అధికం మహేశ్వరి భర్త అధికం నరసాగౌడ్ కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ తనయుడు, రాష్ట్ర బి ఆర్ ఎస్ యూత్ నాయకులు గంప శశాంక్ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకొనడానికి, ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ అన్ని విధాలా అండగా ఉంటాడని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షులు గర్గుల్ రాజా గౌడ్, మండల బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు గడ్డం చిన్న రవీందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పందిరి ప్రభాకర్ రెడ్డి, తోట భూమయ్య, సొంటెం సాయిలు, సతీష్ గౌడ్, తదితరులు ఉన్నారు.