దారి తెలిసిన నడక

దారి తెలిసిన నడకపరిణామ సిద్ధాంతం తర్వాత దేవుడు ఈ సష్టిని సష్టించాడనే ఊహాతీత భావన పటాపంచలైంది. దేవుడు అనే భావన గుట్టు తేలితే మతం నిలబడదు. కాబట్టి మత భావన గల పాలకులకు ”నేచురల్‌ సెలక్షన్‌ థియరి” అనే సత్యాన్ని కనుమరుగు చేసే ఆలోచనతో డార్విన్‌ పరిణామ సిద్ధాంతం అనే సత్యాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించారు. సహజ సూత్రాలు, ప్రకతి న్యాయాలను పాతర వేసి అవివేకమైన మత భావనలను చరిత్రగా చూపే ప్రయత్నంలో భాగమే ఇదంతా అని చెప్పవచ్చు. శ్రీనివాస్‌ చెప్పినట్టు ఏ దేశమైనా మైథాలజీ ని చరిత్రను వేరువేరుగా చూస్తాయి. కానీ భారతదేశం నాగరిక ఆలోచనలతో ముందుకు వెళుతుందని భావిస్తున్న క్రమంలో ఇప్పటి పాలకులు మైథాలజీని చరిత్రగా బుకాయిస్తూ ప్రజలందరూ దాన్ని నమ్మాలని బలవంతం పెట్టడం అనేది ఒక అనాగరిక చర్య.

సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల పరిశీలనలో ఎర్రోజు శ్రీనివాస్‌ది ఒక ప్రత్యేక స్థానం. రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని ఆయన తన కలం ద్వారా ఎప్పటిక ప్పుడు మన ముందు ఉంచుతూ వస్తున్నాడు. అలా వివిధ పత్రికల్లో ఆయా సందర్భాలలో ఆయన రాసిన వ్యాసాల్లో నుండి ఇరవై రెండు వ్యాసాలతో కూడిన వ్యాస సంపుటిని ”నడక – దశాబ్ది గమనం” పేరుతో ఇటీవల వెలువరించాడు. తెలంగాణ సాధించిన ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన వివిధ అభి వృద్ధి కార్యక్రమాల విశ్లేషణతో పాటు భారత రాజకీయాలు, ఆర్థిక అంశాలు, పెడదారి పట్టి న మత రాజకీయ పోకడలు మొదలైన వాటిపైన శ్రీనివాస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఏర్రోజు శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా క్రియాశీలక పాత్రను పోషిస్తూ తెలంగాణకు జరుగు తున్న అన్యాయాల పట్ల తనదైన విశ్లేషణతో వ్యాసా లు రాస్తున్నారు. గోదావరి కృష్ణానది జలాల్లో తెలం గాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయన రాసిన ”ముందు పంపకాలు తర్వాతే బోర్డు” వ్యాసంలో విపులంగా చర్చించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం గా ఒక గెజిట్‌ ద్వారా నీటిపారుదల శాఖలను తన గుప్పెట్లో పెట్టుకున్న కేంద్రం విధానాలను సామా న్యుడికి సైతం అర్థమయ్యేట్టుగా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లపాటు నిర్మాణానికి నోచు కోని ప్రాజెక్టులను పూర్తిచేసుకునే ప్రయత్నానికి కేంద్రం విధానాలు అడ్డంకిగా మారాయి అన్నది శ్రీనివాస్‌ అభిప్రాయం.
అలాగే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అం శాలు కార్యరూపం దాల్చకపోవడం కేంద్రం అటు వైపుగా ప్రయత్నాలు చేయకపోవడం విభజన ద్వారా రాష్ట్రానికి దక్కవలసిన ఆస్తులు సంస్థలు పూర్తిస్థాయిలో కేటాయించకపోవడం అనేది రాష్ట్ర విభజన స్పూర్తికి విఘాతం కలిగించే విషయం. నిజానికి కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద న్నగా ఉంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కానీ కేంద్రం తెలంగాణ పట్ల వివక్షను పాటిస్తూ దిగజారుడు రాజకీయాలను సూచిస్తు న్నది. పదేళ్లయినా విభజన చట్టంలోని సూత్రాలను అమలుపరచకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
భారతదేశంలో సంచలనం సృష్టించిన రైతు చట్టాలు దానికోసం వివిధ రాష్ట్రాల రైతులు చేసిన ఆందోళనలు రైతు చట్టాల చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టాలు. కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతి రేక చట్టాలను దేశ రైతులు, మేధావులు వ్యతిరేకిం చినా కేంద్రం మొండి పట్టుదలకు పోవడం వలన దేశమంతటా ఆందోళనలు జరిగాయి. రైతు ప్రయో జనాలకే ఈ చట్టాలని కేంద్రం బుకాయింప చూసి నా ఆ చట్టాలు కార్పొరేట్‌ శక్తులకు భారత వ్యవసా యాన్ని ధారదత్తం చేసే ఒక కుట్రగా శ్రీనివాస్‌ లాంటి వారు విశ్లేషణతో చెప్పారు. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, రైల్వేలు, ఎల్‌ఐసి లాంటి జాతీయ సంపదలను కార్పొరేట్లకు కట్టబెట్టిన కేంద్రం వ్యవసాయాన్ని కూడా రైతన్నల చేతుల్లోంచి లాక్కునే ప్రయత్నాన్ని ఆయన తన వ్యాసంలో ఎండగట్టారు.
కాలక్రమంలో జరుగుతున్న సంఘటనలను, పరిణామాలను రికార్డు చేసిన దాన్ని చరిత్ర అంటాం. కానీ ఆయా కాలాల్లో మనకు ఇష్టం లేని వ్యక్తులు పాలిస్తే లేదా మనకు నచ్చని సిద్ధాంతాలు ప్రజల్లో పాదుకుంటే ఆ చరిత్రను చరిత్ర ఘట్టాల నుండి తొలగించడం పూర్తిగా అనాగరి కం. ఈ అనాగరిక చర్యలను తప్పుపడు తూ ఎర్రోజు శ్రీనివాస్‌ ”దేశ చరిత్రపై కాషాయ కత్తి” పేరుతో నాలుగు వ్యా సాలు రాశారు. పాలకులు చరిత్రను మార్చి, చరిత్రకాలాన్ని తొలగించి తమ కు నచ్చిన వాటిని మాత్రమే చరిత్రగా ప్రచారం చేసుకునే ఆలోచనలో భాగం గా విద్యార్థుల పాఠ్యపుస్తకాల నుంచి ఆ భాగాలను తొలగించడం అనేది పూర్తిగా నియంతృత్వ చర్య. ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా ప్రచురించిన 11, 12 తర గతి పాఠ్యాంశాల్లోంచి భారత ప్రజాస్వామ్యం-వైవి ధ్యం, భారతదేశంలో ప్రజా పోరాటాలు-ఉద్యమా లు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో రాజకీ యాలు లాంటి పాఠ్యాంశాలను కేంద్రం తొలగిం చడం వల్ల భారత ప్రజాస్వా మ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందు తరానికి తెలి యకుం డా పోతుందనేది శ్రీనివాస్‌ ఉద్దేశం. ముఖ్యంగా భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేకు ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం, ఆ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ పైన విధించిన నిషేధం లాంటి చరిత్ర ఘట్టాలను తొలగించి మహాత్మాగాంధీని హిందూ వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నాన్ని శ్రీనివాస్‌ వివరించారు.
ముఖ్యంగా సమాజంలో గొప్ప పరిణామం తీసుకువచ్చిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు, చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఉద్యమం, నక్స లైట్‌ ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటాలు, ఆది వాసుల హక్కుల కోసం జరిగిన పలు పోరాటాల పా ఠ్యాంశాలను తొలగించడం అనేది భారత భవిష్య త్తుకు గొడ్డలిపెట్టు. చరిత్రలో జరిగిన అసమానత లను, హక్కుల కోసం సంవత్సరాలుగా జరిగిన ఉద్య మాలను, పోరాటాలను తొలగిస్తే భవిష్యత్‌ తరం సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవడంలో క్రియాశీ లకమైన ఆలోచనలు అందించే అవకాశం ఉండ దనేది శ్రీనివాస్‌ విశ్లేషణ. దేశ విభజన సమయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాన్ని కూడా పాఠ్యాంశాల నుండి తొలగించారు. దీనివల్ల రాబోయే తరాలకు సామరస్య సమ జీవనం గురించి ఎలా తెలుస్తుంద నేది శ్రీనివాస్‌ ప్రశ్న. మొఘల్‌ రాజ్య చరిత్రను పా ఠ్యాంశాల నుండి తొలగించడం ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చర్య. ఆ కాలంలోని ఆధు నిక పరిపాలన విధానాలు, దేశవ్యాప్త సర్వే, వ్యవ సాయ రంగంపై జరిగిన కృషి కావాలనే తొలగిం చడం అనేది ప్రభుత్వం కేవలం కాషాయ దృష్టి కలిగి ఉండడమే. అక్బర్‌ కాలంలో జరిగిన అభివృద్ధిని వివ రిస్తూ ఆ అభివృద్ధికి కారకుడు అయిన రాజు పేరు ను తొలగించడం అనేది విద్యార్థులకు ఆ రాజు పేరు తెలియకుండా చేయాలనే కుట్రనే దాగి ఉన్నదని శ్రీనివాస్‌ చెబుతున్నాడు.
మరీ ముఖ్యంగా డార్విన్‌ పరిణామ సిద్ధాం తాన్ని తొలగించడం అనేది పూర్తి అవివేక చర్య. అనే క సంవత్సరాల కృషి తర్వాత రుజువులతో కూడి న మానవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా అనుసరిస్తూ ఆ సిద్ధాంతం ఊతంగా అనేక ఆవిష్క రణలు జరిగాయి. థామస్‌ హాక్సిలే, జోసెఫ్‌ హుకర్‌, రస్సెల్‌ లాంటి ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తలతో కలి సి ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచ మానవ పరిణామ చరిత్రకు కొత్తదారులు వేశాయి. కానీ నేడు భారత పాలకులు సంకుచితమైన మత ధోర ణలతో ఆ పాఠ్యాంశాలను తొలగించడం పైన శ్రీని వాస్‌ తన నిరసనను వ్యక్తిపరిచాడు. పరిణామ సిద్ధాంతం తర్వాత దేవుడు ఈ సష్టిని సృష్టించా డనే ఊహాతీత భావన పటా పంచలైంది. దేవు డు అనే భావన గుట్టు తేలితే మతం నిలబడదు. కాబట్టి మత భావన గల పాలకులకు ”నేచురల్‌ సెలక్షన్‌ థియరి” అనే సత్యాన్ని కనుమరుగు చేసే ఆలోచనతో డార్విన్‌ పరిణామ సిద్ధాంతం అనే సత్యాన్ని పాఠ్యాంశాల నుండి తొలగిం చారు. సహజ సూత్రాలు, ప్రకృతి న్యాయాలను పాతర వేసి అవివేకమైన మత భావనలను చరిత్రగా చూపే ప్రయత్నంలో భాగమే ఇదంతా అని చెప్పవచ్చు. శ్రీనివాస్‌ చెప్పినట్టు ఏ దేశమైనా మైథాలజీని చరిత్రను వేరువేరుగా చూస్తాయి. కానీ భారతదేశం నాగరిక ఆలోచనలతో ముందుకు వెళుతుందని భావిస్తున్న క్రమంలో ఇప్పటి పాలకులు మైథాలజీని చరిత్రగా బుకాయిస్తూ ప్రజలందరూ దాన్ని నమ్మాలని బలవంతపెట్టడం అనేది ఒక అనా గరిక చర్య. మైథాలజీ కథలన్నీ ఫిక్షన్‌ నుండి పుట్టి నవే ఫిక్షన్‌ అనేది మానవుడి ఊహ ప్రపంచం లోంచి పుడుతుంది. అందులోంచి కొన్ని కట్టుకథలు పుట్టు కొచ్చాయి. ఫిక్షన్‌ కథలు ఎప్పుడూ చరిత్రకాలేవు.
ఇంకా ఈ పుస్తకంలో ఓబీసీ కోటా పైన, కోవిడ్‌ పరిణామాల పైన, చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదలపైన, రాజ్యాంగం పైన జరగవలసిన చర్చ, మణిపూర్‌లో జరుగుతున్న తెగల పోరు, అశాస్త్రీయ రాజనీతి శాస్త్ర బోధనలు మొదలైన అంశాల పైన పలు వ్యాసాలు ఉన్నాయి. రాజకీయ, చరిత్ర, భౌగో ళిక, సామాజిక అంశాల పట్ల అవగాహన గల శ్రీని వాస్‌ నుండి ఒక ఆలోచనత్మకమైన వ్యాసాల సంకల నం రావడం హర్షనీయం తన చుట్టూ ఉండే సమ కాలిన రాజకీయ చరిత్రలను తనదైన విశ్లేషణతో చూసే శ్రీనివాస్‌ కలం నుండి మరిన్ని ప్రజో పయోగ, ఆలోచనాత్మకమైన వ్యాసాలు రావాలని ఆశిద్దాం.
సెల్‌ : 9440385563
– డా. చెమన్‌