నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామాన్ని సందర్శించిన భూక్య రామ్ రెడ్డి సిఐడి ఎస్ పి ( కోర్ట్ మానిటరింగ్ హైదరాబాద్) కి స్థానికులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. మండలంలోని పసర గ్రామానికి చెందిన డాక్టర్ పోరిక చంద్రకాంత్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రకాంత్ మామ అయినా రామ్ రెడ్డి పసర గ్రామానికి వస్తున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న చంద్రకాంత్ సహచరులు బంధుమిత్రులు స్నేహితులు తరలివచ్చి రామ్ రెడ్డి ని పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రామ్ రెడ్డి 1989లో పోలీసు శాఖలో ఎస్ ఐ గా ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ఐపీఎస్ హోదాకు చేరుకున్నారు. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభను కనపరుస్తూ పోలీసు సేవ పథకం, పోలీసు ఉత్తమ సేవా పథకం, ప్రధానమంత్రి ప్రాణ రక్ష అవార్డు, పోలీసు మహోన్నత సేవ పథకాలను అందుకున్నారు. తనను కలిసి అభినందించిన వారికి అందరికీ ఎస్ పి రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణ తోపాటు స్వగ్రామం తో పాటు పనిచేసిన ప్రతిచోట అనేక సేవా కార్యక్రమాలలో ప్రజల మన్ననలను పొందారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్, జంపయ్య, సునీల్, వెంకన్న, ఆఫ్రిద్, లక్ష్మణ్ నాయక్, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.