మంత్రి ఎర్రబెల్లికి ఘన స్వాగతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూల్కె 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు వెళ్లిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తానా నాయకులు ఘనస్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, జగదీష్‌ ప్రభల తదితరులు ఆయనకు స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.