
సిద్దిపేట పట్టణానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకై వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావులకు సిద్దిపేట నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ , మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు , పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాజనర్సు, తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం, కౌన్సిలర్లు, నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.