
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ ప్రధాన చౌరస్తాలో వర్షం నీరు రోడ్డుపై నిండుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షపు నీటితో రోడ్డు నీటిమయం కావడంతో ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఈ రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో బోధన్ నుండి వచ్చే ప్రయాణికులకు ఆటంకంగా మారింది. ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.