సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమ కారులను ఆదుకోవాలి


– కృతజ్ఞత సభకు తరలివెళ్లిన ఉద్యమ కారులు

నవతెలంగాణ మల్హర్ రావు: తెలంగాణ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షు బోయిని రాజయ్య యాదవ్, మల్హర్ రావు మండల అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టియూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కి కృతజ్ఞతగ తలపెట్టిన సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తు సిద్ధిపేట అమరవీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించి మాట్లాడారు తెలంగాణ ఉద్యమ కారులను కాంగ్రెస్ పార్టీ గూర్తించి మానిఫేస్టోలో ఉద్యమ కారుల ఆంశాన్ని పొందుపర్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,క్యాబినెట్ మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కేసులు బైండోవర్స్ అయిన వారినే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యమ కారులను ప్రభుత్వం ఆదుకోవాలని జార్ఖండ్ రాష్ట్ర తరహాలో పెన్షన్, బస్సు, ట్రైన్ హెల్త్ కార్డులు జారీ చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బూడిద సతీష్, సభావట్ నాగరాజు, బడితెల వెంకటస్వామి. కోండ్ర సారయ్య, దేవి భూమయ్య, షేక్ చాంద్ పాషా, ఆకుల సది. కోట నవీన్, యాదండ్ల గట్టయ్య, బండారి శంకరయ్య. ఊట్నూరి రమేష్, గడ్డం సమ్మక్క, బండారి యశోద, మేకల కళావతి అక్కల రాజేశ్వరి, అబ్బనవేని సరిత తదితరులు పాల్గొన్నారు.