– పారదర్శకంగా లబ్ధి దారుల ఎంపిక జరగాలి
– ప్రభుత్వ మార్గ దర్షకాలు తూ చా తప్పకుండా పాటించాలి
– నివేదికలు సిద్ధం చేయండి
– సర్పంచుల తో జరిగిన సమావేశం లో జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి
నవతెలంగాణ -తాడ్వాయి
అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకo అందేలా చూడాలని ములుగు జిల్లా zp చైర్ పర్సన్ బడే.నాగజ్యోతి అన్నారు.శనివారం రోజున ఆమె తాడ్వాయి మండలం మేడారం లోని ఐటీడీయే అతిధి గృహంలో స్థానిక మండల సర్పంచ్ లతో సమావేశం నిర్వహించారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ రాబోవు రోజులలో దళిత బంధు,బీసీ బంధు,గృహ లక్ష్మీ వంటి సంక్షేమ పథకాలు కచ్చితంగా అర్హులైన ప్రతి వ్యక్తికి అందే విధంగా నివేదికలు సిద్ధం చేయాలని తాడ్వాయి మండల సర్పంచ్ లకు సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ మార్గదర్శకాలను తూ చా తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎంపిక జరగాలన్నారు.రాష్ట్రం లోని అని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన ఘనత కేవలం సీఎం కెసిఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ వాణిశ్రీ,సర్పంచుల ఫోరం అధ్యక్షులు గడ్డం అరుణ,మేడారం, వూరట్టం, నర్లాపూర్, బీరెల్లి, దామెరవాయి సర్పంచుల చిడం బాబురావు, గొంది శ్రీధర్, చిన్నక్క, చంద్రం, సరిత తదతరులు పాల్గొన్నారు.