తెల్లారిన ఉదయం

మెల్లగా చీకటి పొగిలిపోతూ
చిన్నారి కాళ్ల పట్టీల చప్పుళ్లు
నాన్న గుండెల్లో మ్రోగిన వేళ
ఆనందం నిండిన మనసుకి
ఏదో కొత్త ఊపిరి ఇచ్చినపుడే
ఆలోచించుకున్నా 35 ఏళ్ళ వయసులో-
”ఇదే కదా తండ్రి ఆనందభాష్పాలు!”
తెల్లారిన ఉదయం
గుమ్మము ముంగిట నీళ్ల చప్పుళ్లు
నా చెవికి మధురమైన సంగీతం
”ఏవండీ, ఇవిగోండి, లేవండీ…”
అంటూ దగ్గరకొచ్చిన నెస్కెఫీ,
ఒక్కసారి గొంతులోకి వెళ్ళాక
”మళ్ళీ కావాలా?” అంటూ
నవ్విన నా వయ్యారి భామ!
తెల్లారిన ఉదయం
చేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌
చూస్తుండగానే మ్రోగిన అమ్మ ఫోన్‌,
”ఏం చేస్తున్నావ్‌?”
అంటూ నాన్న పలకరింపు-
ఆ పలుకుతో లేచిన నా చిన్ని చిన్నూ!
ఇలాగే నిత్యం సాగిపోతున్న జీవితం,
అన్నీ మారినా మారని ఈ ఉదయం,
ఒక్కసారి ఊహించుకుంటే –
తెల్లారిన ప్రతి ఉదయం, ఒక నూతన కవిత !
– నవీన్‌, 9642919779