కోరుకంటి గెలుపు కోసం విస్తృత ప్రచారం

నవతెలంగాణ – గోదావరిఖని:
రామగుండం నియోజకవర్గంలో కోరుకంటి చందర్ గెలుపు కోసం 48వ డివిజన్ లో జామా మసీదు ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి చేపట్టిన అద్భుత పథకాలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు ముస్లిం పెద్దలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, 50 డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి తిరుపతి, కోఆప్షన్ సభ్యులు రఫిక్, సమన్వయ కమిటీ మెంబర్ అహ్మద్ నాని ఓదెలు దేవి వెంకటేష్ మరికొంత మంది ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.