వారంతపు సమావేశంలో మౌళిక వసతుల పైన విస్త్రుత స్థాయి సమావేశం

నవతెలంగాణ – జుక్కల్

వారంతపు సమావేశంలో మండలంలోని గ్రామాలలోని మౌళిక  సమస్యలను పరిష్కరించేందుకు మండలంలోని జాతీయ ఉపాదీ హమీ పథకం ముఖ్య ఉద్దేశం, వంటి ప్రభుత్వ పథాల పైన టీఏలు, ఏఫ్లులు, మేట్లు. గ్రామ పంచాయతి కార్యదర్శులతో జుక్కల్ ఎంపిడీవో శ్రీనివాస్ వారంతపు సమావేశం  మండల పరిషత్ కార్యాలయం లో నిర్వహించారు. ఈ సంధర్భంగా త్రాగునీరు, మేబిలైజ్ షన్ , నర్సరుల పెంపకం, గ్రీన్ షెడ్, ఇతర ఆంశాల పైన నివేదికలు, సమస్యల పరిష్కారం ఆంశాల పైన చర్చించి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జుక్కల్ ప్రాథమీక ముప్పై పడకల   ఆసుపత్రి కి ఆకస్మీకంగా పరీశీలన చేసి రోగులకు ఓఆర్ఎస్ ప్యాకేట్లను అందచేసారు. కార్యక్రమంలో ఏపీవో తదితరులు పాల్గోన్నారు.