‘యూసీసీపై విస్తృత సంప్రదింపులు అవసరం’

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై నిర్ణయానికి వచ్చే ముందు దానిపై ప్రజలలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ మురారి అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో యూసీసీపై చట్టం చేయడానికి ముందే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికే విలువ ఉంటుందని చెప్పారు.