నవతెలంగాణ-కొందుర్గు
భర్త వేదింపులు భరించలేక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భార్య బస్సులోనుంచి దూకడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొందుర్గు మండలం పరిధిలోని శ్రీరంగాపూర్ శివారులో గురువారం చోటు చేసేకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దస్తగిరి, మరియం భార్యాభర్తలు. వీరు కొడంగల్ నుంచి హుస్నాబాద్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. తాగిన మైకంలో భర్త బస్సులోనే గొడువ పడుతూ, ఆమెపై పెద్ద పెద్దగా అర్వడంతో ఆ వేదింపులు భరించలేక బస్సులో నుంచి దూకింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలై, అపస్మరక స్థితిలోకి చేరుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం ఈ ఘటనను గమనించి, అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో గాయపడ్డ మహిళను ప్రయివేటు ఆటోలో షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమయస్పర్తితో వ్యవహరించిన ఏసీపీకి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.