భర్తను హతమార్చిన భార్య

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని రెండు రోజుల కింద కులాస్పూర్ గ్రామంలో జరిగిన ఘటన మరువకముందే మళ్లీ న్యాల్కల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య కట్టుకున్న భర్తను శుక్రవారం అర్ధరాత్రి హత్య చేసింది. సిఐ సురేష్ కుమార్  ఎస్ హెచ్ ఓ గంగాధర్ తెలిపిన కథనం ప్రకారం.. భార్య భర్తలు లక్ష్మి, లక్ష్మణ్ 35 ఈ మధ్య వారికి తరచూ గొడవలు జరిగేవి శుక్రవారం రాత్రి కూడా గొడవ జరగడంతో భార్య ఆగ్రహంతో భర్త  తలపై బండరాయితో మోపి హతమార్చింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితురాలని అదుపులోకి తీసుకునీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.