కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

– అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని దారుణానికి తెగబడ్డ భార్య
నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్ : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భార్య భర్త  ఓర్సు వెంకన్న (50) ను దారుణంగా హతమార్చిన ఘటన బుధవారం రాత్రి నల్లగొండ పట్టణంలో జరిగింది. ఈ దారుణానికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా  ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య మైసమ్మతో కలిసి  ఉపాధి నిమిత్తం నల్లగొండ పట్టణానికి వచ్చాడు. ముషంపల్లి ోడ్డు పక్కన హైటెక్ కాలనీలో గుడిసె వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మైసమ్మ వెలుగు పల్లి గ్రామానికి చెందిన కండే బిక్షంతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో వెంకన్న భార్య మైసమ్మ తో గత కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి  వెంకన్నను బిక్షం ఆదేశాలతో మైసమ్మ రాయిపై బలంగా నెట్టివేసింది. గాయపడ్డ వెంకన్న పై కూర్చుని మెడ పిసికి దారుణంగా హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం భర్త వెంకన్న సహజంగా మరణించాడని ప్రచారం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారు.