ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం మైలార్దేవ్పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతి కాలనీలో ఉండే నరసమ్మ(65) ఉదయం ఇంట్లో నుంచి బ యటకి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన ఇసు క లారీ ఢీకొట్టింది. లారీ ముందు చక్రాలు పైనుంచి వెళ్లడంతో ఆమె ఎక్కడి కక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వలన ఆమె మృతి చెందిందని స్థానికులు పోలీసుల ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.