గుర్తు తెలియని వాహనం ఢకొీని మహిళ మృతి

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
గుర్తు తెలియని వాహనం ఢకొీని మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శివరాంపల్లి వద్ద ఓ మహిళ (52)రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఆమెను ఢకొీట్టింది. మహిళ తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఎవరూ ఆ మహిళను గుర్తించకపోవడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా మహిళను ఢకొీట్టిన వాహన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.